65 వేల దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు పడిపోయింది.
- ఐటీ, మెటల్ షేర్లలో భారీగా అమ్మకాలు
- అంతర్జాతీయ పరిణామాలే కారణం
ముంబై, ఆగస్టు 18: దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు పడిపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోసింది.
ట్రేడర్లలో సెంటిమెంట్ నిరాశాజనకంగా ఉండటంతో ఒక దశలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 202.36 పాయింట్లు కోల్పోయి 64,948.66 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 55.10 పాయింట్లు కోల్పో యి 19,310.15 వద్ద జారుకున్నది. తీవ్ర ఊగిసలాటల మధ్య ప్రారంభమైన సూచీ మధ్యాహ్నాం తిరిగి లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మార్కెట్లను పడేశాయి.
- ఈవారంలో సెన్సెక్స్ 373.99 పాయిం ట్లు, నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయింది.
- టీసీఎస్ షేరు 2.14 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మహీంద్రాఅండ్‌మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్‌ఫార్మాలు ఒక్క శాతానికి పైగా మార్కెట్‌ను కోల్పోయాయి.
- కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ల నష్టపోయాయి.
- కానీ, రిలయన్స్, మారుతి, నెస్లె, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, టాటా మోటర్స్, ఐటీసీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్లు లాభాల్లో ముగిశాయి.
- ఐటీ రంగ సూచీ అత్యధికంగా 1.46 శాతం వరకు నష్టపోయింది. టెక్ ఇండెక్స్ 1.26 శాతం పడిపోగా, మెటల్, రియల్టీ, టెలి కమ్యూనికేషన్, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ సూచీలు కూడా భారీగానే పతనం చెందాయి.
- కానీ, పవర్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- టోక్యో, షాంఘై, హాంకాంగ్, యూరోపియన్, అమెరికా సూచీలు నష్టపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

