ముంబై, జూలై 2: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కివచ్చే అవకాశం ఉండటంతోపాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో మదుపర్లను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఫలితంగా ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 579.48 పాయింట్లు అందుకొని 77,502.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగబాకి 24,175.70 వద్ద ముగిసింది.
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన ఐటీ రంగ షేర్లు కదంతొక్కాయి. దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ షేరు 6 శాతం వరకు లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా 4.32 శాతం లాభపడగా, టీసీఎస్ 4.28 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 4.12 శాతం, విప్రో 2.35 శాతం చొప్పున బలపడ్డాయి.