వరుస నష్టాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా నాలుగు రోజుల్లో నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి.
- 160 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా నాలుగు రోజుల్లో నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కితీసుకోవడం, గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించినప్పటికీ సూచీలు లాభాల్లోకి వచ్చాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. నష్టాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 160 పాయింట్లు లాభపడి 62,570.68 వద్ద ముగిసింది. మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 48.85 పాయింట్లు అందుకొని 18,609.35 వద్ద స్థిరపడింది.
- యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రాఅండ్మహీంద్రాలు లాభాల్లో ముగిశాయి.
- కానీ, సన్‌ఫార్మా 3.57 శాతం తగ్గి టాప్‌లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు పవర్‌గ్రిడ్, టీసీఎస్, నెస్లె, విప్రో, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌లు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.
- 30 షేర్ల ఇండెక్స్‌లో 13 లాభపడగా, 17 సూచీలు నష్టపోయాయి.
- బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 28 సెంట్లు పెరిగి 77.45 డాలర్లు పలికింది.
- డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 3 పైసలు పెరిగి 82.44 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌సీఏ సభ్యుల బ్లాక్ టికెట్ల దందా
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

