కాంగ్రెస్ నాయకుడి ఘరానా మోసం!
శేరిలింగపల్లికి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న దుర్గం శ్రీహరిగౌడ్.. తన నానమ్మ బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించడమే కాకుండా, ఒక బాబాయ్ చనిపోగా, మరో బాబాయ్ బతికుండగానే చనిపోయినట్టు కట్టు కథలు చెప్పి వారి ఆస్తిని లాగేసుకున్న ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
- నానమ్మ బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తెచ్చి ప్రాపర్టీ కాజేసిన దుర్గం శ్రీహరిగౌడ్
- ఇంటి విషయమై తలెత్తిన గొడవలో సొంత పిన్ని, తమ్ముడిని చితకబాదిన వైనం
- తమ కుటుంబాన్ని దూషిస్తున్నారని చిన్నాన్న కుటుంబంపై శ్రీహరిగౌడ్ ఫిర్యాదు
- చందానగర్ పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదుతో ఇరువర్గాలపై కేసు నమోదు
- శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న శ్రీహరిగౌడ్
కొండాపూర్, ఆగస్టు 8 : శేరిలింగపల్లికి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న దుర్గం శ్రీహరిగౌడ్.. తన నానమ్మ బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించడమే కాకుండా, ఒక బాబాయ్ చనిపోగా, మరో బాబాయ్ బతికుండగానే చనిపోయినట్టు కట్టు కథలు చెప్పి వారి ఆస్తిని లాగేసుకున్న ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మోసం బయటపడటం, రిజిస్ట్రేషన్ అయిన ఆస్తి కోర్టు వివాదంలో ఉందన్న కోపంతో శ్రీహరిగౌడ్ తన పిన్ని, ఆమె కొడుకును చితకబాదాడు.
ఘటన వివరాలు.. శేరిలింగపల్లి మండలం తారానగర్‌లో శ్రీహరిగౌడ్ నానమ్మ పేరున ఇల్లు ఉన్నది. ఈ ఇంటిపై కన్నేసిన శ్రీహరిగౌడ్, తన నానమ్మ బతికి ఉండగానే ఆమె చనిపోయినట్టు, బతికున్న మరో కుమారుడు పెండ్లి కాకుండానే చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సంపాదించాడు. తప్పుడు సర్టిఫికెట్తో ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న బతికున్న బాబాయ్ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ ఇంటి పైఅంతస్థులో శ్రీహరిగౌడ్ కుటుంబం నివాసం ఉంటుండగా, కింది అంతస్తును బాబాయ్ కుటుంబం అద్దెకిచ్చింది.
ఇంటి వివాదం కోర్టులో ఉండగా, ఇల్లు తనకు దకకుండా బాబాయ్ భార్య మౌనిక, ఆమె కుమారుడు సాయిచరణ్ అడ్డుకుంటున్నారని వారిపై కక్ష పెంచుకున్న శ్రీహరిగౌడ్.. గురువారం ఇంటి వద్ద రిపేర్ పనులు చేయిస్తుండగా శ్రీహరిగౌడ్ తన సోదరుడు సతీశ్‌తో కలిసి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు మౌనిక చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదేక్రమంలో తన పిన్ని మౌనిక నిత్యం తమ కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ తమ కుటుంబంపై దాడి చేసి పారిపోయినట్టు శ్రీహరిగౌడ్.. మౌనిక కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. శ్రీహరిగౌడ్ కాంగ్రెస్ నాయకుడు కావడంతో కేసు నమోదుకు అంగీకరించని పోలీసులు, బాధితురాలి తరఫున పలువురు నిలిచి పోలీసులపై ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

