ముంబై, అక్టోబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిశాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 328.72 పాయింట్లు లాభపడి 82,500.82కి చేరుకున్నది. మరో సూచీ నిఫ్టీ కూడా 103.55 పాయింట్లు అందుకొని 25,285.35 వద్ద స్థిరపడింది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 2.16 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు మారుతి సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, హెచ్‌సీఎల్, మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటర్స్, ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి.