న్యూఢిల్లీ, జనవరి 19: దేశీయ ఐటీ సంస్థలకు నూతన కార్మిక చట్టాల సెగ గట్టిగానే తగులుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో టాప్ -6 సంస్థలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి సంస్థలు మొత్తంగా రూ.5,400 కోట్ల నిధులను వెచ్చించాయి. నూతన కార్మిక చట్టాలను అమలులోకి తేవడానికి ఒకేసారి ఇంతటి భారీ స్థాయిలో నిధులను కేటాయించాయి.
కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాల్లో సమూన మార్పులు చేసి నూతన కార్మిక చట్టాలను ఇటీవల అమలులోకి తీసుకొచ్చింది. దీంతో టీసీఎస్‌పై రూ.2,128 కోట్ల భారం పడనుండగా..హెచ్‌సీఎల్ టెక్నాలజీపై రూ.956 కోట్లు, విప్రోపై రూ.302.8 కోట్లు, టెక్ మహీంద్రాపై రూ.272 కోట్లు. ఎల్టీఐమైండ్ట్రీపై రూ.590 కోట్ల భారం పడనున్నది.