న్యూఢిల్లీ, జనవరి 30: దేశీయ మౌలిక సదుపాయాల సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ. 2,947 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,552.92 కోట్ల లాభంతో పోలిస్తే 15 శాతం వృద్ధిని కనబరిచింది.
అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ ఆదాయం రూ.47,144.75 కోట్ల నుంచి రూ.55,965.57 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.