హైదరాబాద్, ఆగస్టు 3: దివీస్ ల్యాబ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.430 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.356 కోట్ల కంటే ఇది 21 శాతం అధికం. కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికి 19 శాతం ఎగబాకి రూ. 2,118 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. మరోవైపు, పప్టైడ్ ఫ్రాగ్మెంట్స్ మాలుక్యూల్స్ విభాగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.