ముంబై, నవంబర్ 16: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబ్స్ రూ.82 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు అందుకుంది. 2017లో తాము క్లెయిం చేసిన ఐజీఎస్టీ రిఫండ్ రికవరీ కోసం ఈ నోటీసు జారీఅయినట్టు దివీస్ ల్యాబ్స్ గురువారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
ఈ నోటీసుపై జీఎస్టీ చట్టం అనుమతించిన గడువులోగా అప్పిలేట్ అథారిటీలో అప్పీలు చేయాలని నిర్ణయించామని, తమకు సానుకూలమైన ఆర్డరు వస్తుందని ఆశిస్తున్నామని, కంపెనీ ఆర్థిక స్థితిపై ప్రభావం పడదని భావిస్తున్నట్టు దివీస్ వివరించింది.