Danteras 2021 | ధంతేరస్ అంటే ధన త్రయోదశి.. దీపావళి పండుగకు ముందు ఈ పర్వదినం వస్తుంది. ఉత్తర భారతంలో ఐదు రోజుల పాటు ప్రజలు దంతేరస్ పండుగను సంబురంగా జరుపుకుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ఒరవడి కొనసాగుతున్నది. ఈ పండుగ మొదటి రోజును ధన త్రయోదశి అని పిలుస్తారు. దీన్నే ధన్తేరాస్ అని కూడా చెబుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు..
నాడు అమృతం కోసం దేవ దానవులు క్షీర సాగర మదనం చేస్తున్నప్పుడు ధన్వంతరి అవతారంలో శ్రీవిష్ణువు అవతరించారు. అప్పుడే పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన హిందువుల లక్ష్మీదేవిని కొలుస్తారు.
లక్ష్మీదేవిని పూజిస్తే కుటుంబం సకల సంపదలతో అలరారుతుందని భారతీయుల నమ్మకం. అదే విధంగా ధంతేరాస్ నాడు బంగారం కొనుగోలు చేయడం శుభప్రధం అని.. ఏడాది పొడవునా ఆ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడుతుందని నమ్ముతారు.. అందువల్లే ప్రతియేటా ధంతేరాస్ పర్వదినాన బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు రికార్డు స్థాయిలో సాగుతాయి. కానీ గతేడాది కరోనా మహమ్మారి ప్రభావంతో బంగారం దుకాణాలన్నీ వెలవెలబోయాయి. కానీ ఈ ఏడాది కాస్త పరిస్థితి మెరుగు పడింది. దీంతో దేశంలోని బంగారం దుకాణాలన్నీ కస్టమర్లను ఆకర్షించడానికి ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించారు.
కానీ బంగారం కొనుగోలు చేసే టైంలో ఆఫర్ల ప్రభావానికి గురి కావొద్దు. ఆచితూచి రియాక్ట్ కావాలి. స్వచ్ఛమైన బంగారం ఇస్తున్నారా.. లేదా.. చెక్ చేసుకోవాలి. హాల్మార్క్ ముద్ర ఉందా.. లేదా.. అన్న సంగతిని తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ప్రతి ఆభరణంపై బీఐఎస్ ముద్ర.. నాణ్యత.. హాల్ మార్కింగ్ కేంద్రం.. ఎప్పుడు ఆ హాల్ మార్క్ ముద్ర వేశారు.. సదరు ఆభరణం విక్రయించిన దుకాణం లోగో తదితర ఐదు గుర్తులు ఉన్నాయా లేదా ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Volkswagen India : వోక్స్వ్యాగన్ టైగన్కు భారీ రెస్పాన్స్!
Diwali offers : కార్లపై రూ 1.5 లక్షల వరకూ హ్యుందాయ్ ఇండియా ఆఫర్లు!
హైదరాబాద్లో 3డీ ప్రింటింగ్ కేంద్రం
myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జననేంద్రియాలు.. ఆమె పుట్టుక ఇప్పటికీ మిస్టరీనే