Air India – DGCA | టాటా సన్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియాపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.30లక్షల పెనాల్టీ విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పూర్తి చేయకుండానే ఒక పైలట్‌ను విమానం నడిపేందుకు ఎయిర్ ఇండియా అనుమతించిందని డీజీసీఏ విచారణలో తేలింది. గతేడాది జూలై ఏడో తేదీన ఒక పైలట్ తప్పనిసరిగా పాటించాల్సిన రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి మూడు విమానాల టేకాఫ్, లాండిగ్ చేశాడని డీజీసీఏ పేర్కొంది. ఇది సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ నిబంధనలు- పేరా 3ని ఉల్లంఘిచడమేనని స్పష్టం చేసింది.
ఈ విషయమై గత నెల 13న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఎయిర్ ఇండియా ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని డీజీసీఏ తెలిపింది. ఇక ఎయిర్ ఇండియా యాజమాన్యం సీఏఈ విండో వస్తున్న పలు అలర్ట్‌లను పట్టించుకోవడం లేదని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ – 1937లోని 162వ నిబంధన కింద ఎయిర్ ఇండియాపై రూ.30 లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది.