న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ, బార్డ్, డాల్-ఈ వంటి ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్ రాకతో (AI Prompt Engineers) పని పద్ధతులు పూర్తిగా మారడం, ఏఐ టూల్స్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుండటంతో న్యూ టెక్నాలజీపై హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ టూల్స్ ఎంట్రీతో జాబ్ మార్కెట్లోనూ నూతన ట్రెండ్స్ వెల్లువెత్తుతున్నాయి. మారుతున్న టెక్నాలజీతో ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ పోస్టులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌కు ప్రశ్నలు సంధించి సూచనలు జారీ చేసే ప్రోగ్రామ్ నైపుణ్యాలు కలిగిన ప్రాంప్ట్ ఇంజనీర్లకు రూ. 2.4 కోట్ల వరకూ వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఉద్యోగులు ఏఐ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కూడా కంపెనీలు కోరుతున్నాయి. ఏఐ సంబంధిత పోస్టులకు రూ. కోట్ల వేతనాలు ఆఫర్ చేసేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌కు ప్రోగ్రాం రూపొందించేవారికి కేవలం ఎలా రాయాలో, ఏఐ టూల్స్‌కు సూచనలు చేయగల పరిజ్ఞానం ఉంటే చాలని ఆర్బీసీ వెల్త్ మేనేజ్మెంట్ టెక్నాలజీ హెడ్ గ్రెగ్ బెజర్ చెబుతున్నారు.
ప్రొఫెషనల్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లకు ఏడాదికి రూ. 2.4 కోట్ల వరకూ వేతనం ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. మెరుగైన ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్‌కు ప్రశ్నలు అడగడం కంటే కూడా ఏఐ, ప్రోగ్రామింగ్, ల్యాంగ్వేజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి అన్ని విభాగాల్లో పట్టు ఉండటం కూడా కీలకమని తెలిపారు. ఏఐ ఎంట్రీతో మార్పులకు అనుగునంగా నైపుణ్యంతో కూడిన ఏఐ స్కిల్స్ తెలిసిన ప్రొఫెషనల్ రైటర్స్‌కు గిరాకీ పెరిగిందని చెప్పారు.
Read More :
Amazon Year End Deals | అమెజాన్ ఇయర్ ఎండ్ బంఫర్ ఆఫర్లు.. ఐఫోన్ టూ రియల్మీ వరకూ.. ఇవీ డిటైల్స్