హైదరాబాద్, మే 22: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా ప్రమోటర్ కృష్ణ ప్రసాద్ తన వాటాను తగ్గించుకున్నారు. బహిరంగ మార్కెట్లో 3.09 శాతానికి సమానమైన 75 లక్షల షేర్లను విక్రయించడంతో రూ.304 కోట్ల నిధులు సమకూరాయి. బ్లాక్ డీల్ ద్వారా జరిగిన ఈ ఒప్పందంలో షేరు ఒక్కింటికి రూ.405.80 చొప్పున ఆయన బహిరంగ మార్కెట్లో విక్రయించారు. దీంతో సంస్థలో ఆయన వాటా 34.78 శాతం నుంచి 31.69 శాతానికి తగ్గింది.