BOB and BOI | బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్త సారధులు..!
BOB and BOI | బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ కం సీఈఓగా దేవదత్త చంద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ కం సీఈఓగా రజనీశ్ కర్నాటక్ నియమితులయ్యారు.
BOB and BOI | రెండు కేంద్ర ప్రభుత్వ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సీఈఓలను నియమించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మేనేజింగ్ డైరక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా దేబదత్త చంద్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా రజనీశ్ కర్నాటక్లను నియమిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ కం సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేబదత్త చంద్ మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో దేబదత్త చంద్.. ఇదే బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. దీంతో వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి దేబదత్త చంద్ మూడేండ్ల పాటు బీవోబీ ఎండీ కం సీఈఓగా ఉంటారు.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ కం సీఈఓగా ఉన్న సంజీవ్ చద్దా స్థానంలో దేబదత్తా చంద్ నియమితులయ్యారు. వాస్తవంగా గత జనవరి 19న సంజీవ్ చద్దా రిటైర్ కావాల్సి ఉన్నా.. ఆయన పదవీ కాలాన్ని కేంద్రం జూన్ 30 వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థల అధిపతుల నియామకానికి ఏర్పాటైన ఎఫ్ఎస్ఐబీ గత జనవరిలో దేబదత్త చంద్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. తదనుగుణంగా కేంద్రం చంద్‌ను బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓగా రజనీశ్ కర్నాటక్ నియమితులయ్యారు. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

