Tejas Mark-1A jets | భారత వైమానిక దళం (Indian Air Force) చరిత్రలో చెరగని ముద్రవేసిన ఫైటర్ జెట్ మిగ్-21 శకం (MiG-21 fighter jets) ముగియనుంది. రేపు వీటికి వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే 1ఏ ఫైటర్ జెట్లు (Tejas Mark-1A jets) రానున్నాయి. రూ.62వేల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం ఇటీవలే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రక్షణ శాఖ (Ministry of Defence), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) మధ్య నేడు కీలక ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
కాగా, రూ.48వేల కోట్లతో 83 యుద్ధవిమానాల సమీకరణకు కేంద్రం కొన్నేళ్ల కిందట పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో విడతగా రూ.62వేల కోట్లతో 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు సిద్ధమైంది. మిగ్-21 యుద్ధవిమానాల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. నిజానికి మిగ్ -21 జీవితకాలం ఎప్పుడో ముగిసినా తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిలో జాప్యం కారణంగా దానిని పొడిగించారు. రేపటితో మిగ్-21 ఫైటర్ జెట్స్ కనుమరుగు కానున్న వేళ.. ఈ కీలక ఒప్పందం జరిగనున్నట్లు సమాచారం. తేజస్ రాకతో వైమానిక దళ పోరాట సామర్థ్యం మరింత పెరగనుంది.
Also Read..
Ladakh Violence | లద్ధాఖ్‌లో ఆందోళనలు.. 50 మంది అరెస్ట్
Ladakh Violence | లద్దాఖ్‌లో జరిగింది జన్ జెడ్ నిరసనలు కాదు.. కాంగ్రెస్ నిరసన : బీజేపీ