Ladakh Violence | రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌తో లద్దాఖ్ (Ladakh Violence)లో జనరేషన్ జెడ్ (Gen Z) యువత నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో నలుగురు మరణించగా, 90 మందికిపైగా గాయపడ్డారు. ఆందోళనకారులు లద్దాఖ్‌లోని బీజేపీ కార్యాలయం, హిల్ కౌన్సిల్ సెక్రటేరియట్‌ను తగలబెట్టారు. ఈ ఆందోళనలపై బీజేపీ (BJP) తీవ్రంగా స్పందించింది. అల్లర్ల వెనుక కాంగ్రెస్ (Congress) కుట్ర ఉన్నట్లు ఆరోపించింది. ఈ మేరకు యువత చేపట్టిన అల్లర్లలో కాంగ్రెస్ కౌన్సెలర్ పుంట్సోగ్ స్టాంజిత్ తెపాగ్ (Phuntsog Stanzin Tsepag) పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. ‘లద్దాఖ్‌లో జరిగిన నిరసనలను జనరల్ జెడ్ నాయకత్వంలో నిర్వహించినట్లు చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ దర్యాప్తులో అది జనరల్ జెడ్ నిరసన కాదని, కాంగ్రెస్ నిరసన అని తేలింది. కాంగ్రెస్ కౌన్సెలర్ పుంట్సోగ్ స్టాంజిత్ తెపాగ్ ఈ అల్లర్లలో పాల్గొన్నారు. అతడు, అతని కార్యకర్తలు హింసను ప్రేరేపిస్తున్నట్లు అనేక ఫొటోలు మా దృష్టికి వచ్చాయి. అతడు చేతిలో ఆయుధంతో బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్తున్నట్లు ఫొటోలు బయటకు వచ్చాయి. జనసమూహాన్ని రెచ్చగొడుతూ బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు’ అని అన్నారు. మరోవైపు బీజేపీ ప్రదర్శించిన ఫొటోలు, వీడియోల ఆధారంగా స్థానిక పోలీసులు తెపాగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read..
CP Radhakrishnan | తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
Liquor Scam | మద్యం కుంభకోణం.. మాజీ సీఎం కుమారుడు అరెస్ట్