Musk gets Support Union Minister | మస్క్‌తో కేంద్రం అలా.. కేంద్ర మంత్రి ఇలా
Musk gets Support Union Minister | ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై మస్క్‌కు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మద్దతు పలికారు.
Musk gets Support Union Minister | దిగుమతి చేసుకున్న టెస్లా కార్లకు రాయితీలు ఇవ్వాలన్న ఆ సంస్థ సీఈవో ఎలన్‌మస్క్‌తో కేంద్ర ప్రభుత్వం ఎడమొహం పెడమొహం అన్నట్లు వ్యవహరిస్తున్నది. కానీ ఓ విషయంలో మాత్రం ఎలన్‌మస్క్‌ను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు. 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ టేకోవర్ ఒప్పందం పూర్తయిన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని ఎలన్‌మస్క్ సూత్రప్రాయంగా చెప్పారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై ఎలన్‌మస్క్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు.
విద్వేషపూరిత ట్వీట్లు చేస్తూ అనవసర గొడవలకు కారణమవుతున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా బహిష్కరించింది. అలా ట్విట్టర్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అప్పుడే ఎలన్‌మస్క్ వ్యతిరేకించారు. డొనాల్డ్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం అనైతికం అని అభిప్రాయ పడ్డారు. వాక్ స్వాతంత్య్రానికి అవకాశం ఉండాలనే నినాదంతో ట్విట్టర్లో పోల్స్ నిర్వహిస్తూ ఆ సంస్థనే స్వాధీనం చేసుకోబోతున్నారు.
ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిలువరించలేకపోవడం తన వైఫల్యం అని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ తనకు చెప్పారని ఎలన్‌మస్క్ అన్నారు. ట్రంప్ ఖాతాపై శాశ్వత నిషేధం తన వైఫల్యం అంటూ జాక్ డోర్సీ చెప్పారన్న మస్క్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రీ ట్వీట్ చేశారు. ఒక వేదిక నుంచి ఒక వ్యక్తిపై శాశ్వత నిషేధం విధించడం యూజర్ల ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. అలా జరుగవద్దంటే బలమైన చట్టాలు తేవాలని చంద్రశేఖర్ అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

