హైదరాబాద్ : దాండియా ఆటలు, బతుకమ్మ సంబురాలు ఒకే సారి చేయ్యలనుకుంటున్నారా…అది కూడా మంచు సోయాగాల్లో ఆడి పాడి సరదాగా గడపాలనుకుంటున్నారా.. అయితే ఈ దసరాకి హైదరాబాద్ రావల్సిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు అంబరాన్నేంటే విదంగా స్నో కింగ్డమ్(Snow Kingdom) సిద్ధమైంది. కొండాపూర్ శరత్ సిటీ మాల్ (AMB) 5th Floor స్నో కింగ్డమ్ మంచు సోయాగాల్లో పిల్లలకు సరికొత్త థ్రిల్ అందించేలా ఏర్పాటు చేసింది.
స్నో దాండియా పేరుతో హైదరాబాద్ వాసులకు 11 రోజులు పాటు మంచులో ఆటా- పాటలతో స్నో కింగ్డమ్ అలరిస్తుంది. దుర్గాదేవిని పూజిస్తూ దాండియా నృత్యాలు చేయడం గుజరాతీ, రాజస్థానీల ఆచారం. దసరా నవరాత్రుల సమయంలో ఎక్కువగా దాండియా ఆటలే కనిపిస్తాయి. అలాంటి దాండియా మంచులో చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఉత్సాహాన్ని హైదరాబాద్ వాసులకు అందించేందకు స్నో కింగ్డమ్ సిద్ధమైంది. ఈ నవరాత్రులల్లో తొమ్మిది రోజులు.. దాండియా ఆట పాటలతో పాటు బతుకమ్మ సంబరాలతో సరికొత్త సోయగాలతో స్నో కింగ్డమ్ అలరించనుంది. దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న దసరా ఉత్సవాలుకు దేశ వ్యాప్తంగా సంస్కతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తు ఈ వేడుకలు నిర్వహిస్తుంది.
కొండాపూర్లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఈ బతుకమ్మ దాండియా వేడుకలను స్నో కింగ్డమ్ ఏర్పాటు చేసింది. ఇందులో మంచు ప్యాలెస్లు, మంచుతో కప్పిన పర్వతాలు, బ్లాక్ సీల్స్, ఓక్ చెట్లు, ఇగ్లూలు, ధ్రువపు ఎలుగుబంట్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. 32 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్నోకింగ్డమ్ ఏర్పాటు చేశారు. పెద్దలకు రూ.750, పిల్లలకు రూ.650 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించారు. మంచులో ఆడుకోవడం, టోబో గానింగ్, స్నో స్లైడింగ్, స్నో రాక్ క్లైంబింగ్, స్నో డ్యాన్స్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. దసరా పండుగ పురస్కరించుకొని ఇప్పుడు దాండియాను సైతం జోడించారు. అలాగే మంచులో ఆడుకోవడానికి అవసరవయ్యే సూట్ కూడా వాళ్లే ఇస్తున్నారు. మొత్తంగా మంచులో ఎంజాయ్ చేయడానికి దాండియా ఆడటానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేకుండా..మన హైదరాబాద్ లోనే ఏర్పాటైన ఈ స్నోకిండ్ డమ్ మీకు మంచి వినోదాన్ని పంచుతుంది.
దాండియా కేవలం అందరూ కలిసి ఆనందించడానికి ఆడుకొనే ఆటలు మాత్రమే కావని..ఇది ఆరోగ్యపరంగా, ఫిట్ నెస్ పరంగా ఎన్నో ప్రయోజానాలు ఉన్నాయని స్నోకింగ్ డమ్ మేనేజింగ్ డైరెక్టర్ పువ్వాడి హరిక తెలిపారు. దాండియా డ్యాన్ ఒత్తిడిని తగ్గిస్తుందని..ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజులు..దాండియా ఆడి అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతారన్నారు. డాండియా ఒత్తిడి, ఆందోళన కూడా దూరం చేస్తుందంటున్నారు. అలాగే ఎంతో సరదాగా సాగే ఈ ఆట బత్తిడిని దూరం చేయడంతొ పాటు మానసికొల్లాసాన్ని కూడా అందిస్తుందని హరిక అన్నారు.