వచ్చేవారంలో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించనున్నప్పటికీ నికర వడ్డీ మార్జిన్ 3 శాతం సాధించడంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి. డిసెంబర్ 5న రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షలను ప్రకటించనున్నది. సెంట్రల్ బ్యాంక్ పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తున్నదని, దీంతో బ్యాంక్ మార్జిన్లపై భారీ స్థాయిలో ప్రభావం పడే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.
కానీ, ఈవారం మొదట్లో ఎస్బీఐ తన నివేదికలో డిసెంబర్ సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగాను, ఫిబ్రవరి సమీక్షలో మాత్రం పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తాదనే అంచనాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 7.5 శాతంగా అంచనావేసిన ఎస్బీఐ.. మొత్తం ఆర్థిక సంవత్సరానికిగాను 7 శాతం వృద్ధిని సాధించనున్నదని పేర్కొంది.