GST Council meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటైన మంత్రుల బృందం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ స్లాబుల కుదింపుపై నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే, 5, 18శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటైన మంత్రుల బృందం అనుమతినిచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇకపై 5, 18 స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నాయి. అంతేకాదు ఎంపిక చేసిన కొన్ని వస్తువులపై 40 శాతం రేటును విధించే అవకాశాలు ఉన్నాయి.
Also Read..
Apple | లైఫ్ సైకిల్లో కీలక మార్పులు చేసిన ఆపిల్.. ఆ మోడల్స్ అన్నీ వింటేజ్ జాబితాలోకి..!
Luxury EV Cars | లగ్జరీ ఈవీ ధరలకు రెక్కలు.. పన్ను పెంచాలని జీఎస్టీ సిఫారసు