Apple | ప్రముఖ కంపెనీ ఆపిల్ త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనున్నది. ఈ క్రమంలో ఆపిల్ తన ఉత్పత్తుల లైఫ్ సైకిల్ (Product Lifecycle) కీలకమైన మార్పులు చేసింది. పలు పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌లను ‘వింటేజ్’, ఆబ్సోలెట్’ జాబితాలో చేర్చింది. ఆపిల్ ఈ విధానాన్ని చాలాకాలంగా అమలు చేస్తున్నది. ఈ పాలసీ ప్రకారం పాత డివైజెస్‌ను దశలవారీగా సేవల నుంచి తొలగిస్తూ.. యూజర్లు కొత్త మోడల్స్‌కు మారేలా కంపెనీ ప్రోత్సహిస్తుంది.
యాపిల్ తాజా అప్డేట్ ప్రకారం.. ఐఫోన్ ఎక్స్ఎస్ (iPhone XS), ఐఫోన్ 8 ప్లస్ (iPhone 8 Plus)లను ‘వెంటేజ్’ జాబితాలో చేర్చింది. కంపెనీ ఐదు నుంచి ఏడు సంవత్సరాల కిందట డిస్కంటిన్యూ చేసిన డివైజ్‌లు వింటేజ్ లిస్ట్‌లోకి వెళ్తాయి. ఐఫోన్ ఎక్స్ఎస్ సెప్టెంబర్ 2018లో లాంచ్ అయ్యాక 2019లో ఆపేసింది. ఐదు సంవత్సరాల మార్క్‌ను దాటింది. పెద్ద వేరియంట్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్‌ని ఇప్పటికే 2004 నవంబర్‌లో వింటేజ్ లిస్టులో చేర్చింది. ఐఫోన్ 8 ప్లస్, 2017లో విడుదలైన ఈ ఫోన్ ఇప్పుడు అదే జాబితాలోకి వెళ్లింది. వింటేజ్ కేటగిరిలో ఉన్న ఫోన్లకు అధికారిక ఆపిల్ సర్వీసెస్ సెంటర్లలో మరమ్మతులు చేస్తే మాత్రమే అయ్యేందుకు అవసరమైన పార్ట్స్ అందుబాటులో ఉన్నంత వరకు సేవలు లభిస్తాయి.
ఇక ఐపాడ్ 5ని ఆపిల్ ఇప్పుడు ఆబ్సోలెట్ జాబితాలో చేరింది. ఈ జాబితాలో ఉన్న డివైజ్‌లకు అధికారిక సేవలు, స్పేర్‌పార్ట్స్, రిపేర్ చేసే అవకాశం ఉండదు. అలాంటి వినియోగదారులు ఇక థర్డ్ పార్టీ రిపేర్ షాపులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. అదే సమయంలో మ్యాక్ మిని (2018)ని సైతం ఇప్పటికే వింటేజ్ జాబితాలో ఉంది. తాజాగా ఆపిల్ విడుదల చేసిన లైఫ్‌సైకిల్ అప్డేట్ ప్రకారం.. ఏదైనా రిపేర్ వస్తే.. చేయించుకునేందుకు మొదట అధికారిక సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. పార్ట్స్ అందుబాటులో ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవాలని సూచించింది. అయితే, ప్రాంతాలను బట్టి విడిభాగాల లభ్యత మారే అవకాశం ఉంటుందని.. దాంతో రిపేర్లు కష్టతరంగా మారే అవకాశాలున్నాయి.
ఆపిల్ పాలసీ ప్రకారం.. వింటేజ్ జాబితాలోఉన్న డివైజెస్ రెండేళ్లలో ఆబ్సోలెట్గా మారుతాయి. దాని అర్థం ఐఫోన్ ఎక్స్ఎస్లాంటి మోడల్స్‌కు భవిష్యత్తులో ఎలాంటి అధికారిక సపోర్ట్ ఉండదు. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ 8 ప్లస్ వాడుతున్న యూజర్లు అంతా యథావిధిగా వాడుకోవచ్చు. కానీ, భవిష్యత్‌లో విడిభాగాలు దొరకడం కష్టంగా మారుతుంది. కానీ, మరమ్మతులు చేయడం కష్టం అవుతుంది. ఐపాడ్ 5 వినియోగదారులకు ఇక ఆపిల్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు. మ్యాక్ మిని 2018 వాడుతున్న వారు ప్రతిసారి సర్వీస్ సపోర్ట్ కోరే ముందు సంబంధిత సెంటర్లలో అందుబాటులో పార్ట్స్ ఉన్నాయా? లేదా? అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది.