Cisco Layoffs : ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా లేటెస్ట్గా అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ సిస్కో భారీగా కొలువుల కోతకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ వ్యాపార పునర్వ్యవస్ధీకరణకు పూనుకుంది. లేఆఫ్స్‌తో ఎంతమందిపై ఎఫెక్ట్ పడుతుందనే వివరాలను సిస్కో ఇప్పటివరకూ వెల్లడించలేదు.
వచ్చే వారం నుంచి వేలాది మంది ఉద్యోగులపై సిస్కో వేటు వేయనుందని చెబుతున్నారు. ఫిబ్రవరి 14న కంపెనీ ఎర్నింగ్ కాల్ సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సిస్కోలో ప్రపంచవ్యాప్తంగా 84,900 మంది పనిచేస్తుండగా కొలువుల కోతతో ఈ సంఖ్య భారీగా తగ్గనుంది.
2022 నవంబర్‌లో దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించడంతో ఈసారి లేఆఫ్స్ ఎలా ఉంటాయని టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక ఇటీవల అమెజాన్, అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ఇక స్నాప్‌చాట్ మాతృసంస్ధ స్నాప్ వంటి స్టార్టప్‌లు సైతం కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ-కామర్స్ సైట్ ఈబే 1000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.
Read More :
Age Limit | నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాలకు వయోపరిమితి మరో రెండేండ్లు పెంపు