Rs.2000 Note Circulation | తగ్గుతున్న రూ.2000 నోటు సర్క్యులేషన్.. వెల్లడించిన ఆర్బీఐ
Rs.2000 Note Circulation | పాత పెద్దనోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు పంపిణీ తగ్గుతున్నదని ఆర్బీఐ వెల్లడించింది.
Rs.2000 Note Circulation | రూ.2000 విలువ గల నోటు పంపిణీ నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ డేటా వెల్లడించింది. కొన్నేండ్లుగా కొత్తగా రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రూ.2000 నోట్ల సర్క్యులేషన్ 1.6 శాతం తగ్గిపోయింది. 2020-21లో రెండు శాతం పంపిణీ పడిపోయింది. ఓవరాల్‌గా గతేడాదితో పోలిస్తే 17.3 శాతం నుంచి 13.8 శాతం రూ.2000 విలువైన నోట్ల సర్క్యులేషన్ పడిపోయిందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.
గత మార్చి నెలాఖరు నాటికి మొత్తం చలామణిలో ఉన్న నోట్లలో రూ.500, రూ.2000 నోట్ల విలువ 87.1 శాతం ఉంటుందని ఈ నివేదిక సారాశం. 2021 మార్చి నెలాఖరు నాటికి రూ.500 + రూ.2000 నోట్ల మొత్తం విలువ 85.7 శాతం అని పేర్కొంది. పరిమాణంలో రూ.500 నోట్లు 34.9 శాతం ఉంటాయి. పరిమాణంలో రెండో స్థానంలో రూ.10 నోట్లు. మొత్తం నోట్లలో రూ.10 నోట్ల పరిమాణం 21.3 శాతం ఉంటుంది.
2016లో నాటి పెద్ద నోట్లు రూ.500-రూ.1000 రద్దు చేసి.. వాటి స్థానంలో రూ.2000 నోటు తీసుకొచ్చింది. 2021-22లో నోట్ల విలువ 9.9 శాతం, పరిమాణం 5 శాతం పెరిగింది. 2020-21లో నోట్ల విలువ 16.8 శాతం వృద్ధి చెందితే, పరిమాణంలో 7.2 శాతం ఎక్కువైంది. ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 విలువైన నోట్లను ఆర్బీఐ ముద్రిస్తున్నది. ఇంకా 50 పైసలు, రూపాయి, రూ.2, రూ.5, రూ.10, రూ.20 విలువైన నాణాలు చలామణిలో ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

