Retirement Plan | రిటైర్మెంట్ తర్వాత సుఖంగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!
Retirement Plan | ‘ఎన్నో పాత్రలను రసవంతంగా పోషించినా, రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోయాను..’ రంగమార్తాండ సినిమాలోని డైలాగ్ ఇది. ఆ పాత్రల సంగతి సినిమా చూసి తెలుసుకోవచ్చు! కానీ, జీవన రంగస్థలంలోనూ ఎందరో ముఖ్యమైన రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోతున్నారు. అందులో ఒకటి పదవీ విరమణ తర్వాత సాగించాల్సిన జీవనయానం. రెండోది మలిసంజెలో భావోద్వేగాలకు లొంగిపోవడం.
Retirement Plan | ‘ఎన్నో పాత్రలను రసవంతంగా పోషించినా, రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోయాను..’ రంగమార్తాండ సినిమాలోని డైలాగ్ ఇది. ఆ పాత్రల సంగతి సినిమా చూసి తెలుసుకోవచ్చు! కానీ, జీవన రంగస్థలంలోనూ ఎందరో ముఖ్యమైన రెండు పాత్రలకు న్యాయం చేయలేకపోతున్నారు. అందులో ఒకటి పదవీ విరమణ తర్వాత సాగించాల్సిన జీవనయానం. రెండోది మలిసంజెలో భావోద్వేగాలకు లొంగిపోవడం. ‘అప్పటి స్క్రిప్ట్ అప్పుడు చూసుకుందాం లే!’ అనుకుంటే క్లయిమాక్స్‌లో మీ పాత్ర పండదు సరికదా.. విశేషంగా సాగాల్సిన శేష జీవితం విషాదాంతంగా ముగిసిపోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఉద్యోగంలో చేరిన రోజే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి.
రమణకు 30 ఏండ్లు. మంచి కంపెనీలో ఉద్యోగం. భార్య కూడా చదువుకున్నది. ఉద్యోగమూ చేస్తున్నది. ఇద్దరూ చెరో లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక బిడ్డ చాలనుకున్నారు. పండగకు కొడుకు ఇంటికి వచ్చాడు రమణ తండ్రి శ్రీనివాస్. భోజనాలయ్యాక కొడుకుతో మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని చూస్తుంటే సంతోషంగా ఉందిరా! మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?’ అని అడిగాడు. ‘ఏముంది నాన్నా! ముందుగా ఇల్లు కొనుక్కోవాలి. తర్వాత కారు. చిన్నది ఏమవుతానంటే అది చదివించాలి. తర్వాత దాని పెండ్లి. ఏడాదికి ఒకటో రెండో టూర్లు వేస్తూ.. హాయిగా జీవితం గడిపేస్తే చాలు అనుకుంటున్నాను’ అన్నాడు. ‘మరి రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేసుకోలేదా?’ అన్నాడు తండ్రి! ‘ఇప్పుడే ఎందుకు నాన్నా! దానికింకా చాలా టైమ్ ఉంది కదా..’ అన్నాడు తేలికగా! కొడుకు మాటవిన్న శ్రీనివాస్ భారంగా నిట్టూరుస్తూ ‘నేను చేసిన తప్పే, నువ్వూ చేస్తున్నావన్నమాట!’ అన్నాడు.
ఆ రోజు రావొద్దంటే..
రమణ తండ్రివంక ప్రశ్నార్థకంగా చూశాడు. శ్రీనివాస్ తన మాటలను కొనసాగిస్తూ.. ‘నీకు తెలుసుగా నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను. నిన్ను, చెల్లిని బాగా చదివించడం ఒక్కటే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. చాలీచాలని సంపాదనే అయినా మీకు ఏ లోటూ రాకుండా చూసుకున్నా! మీ ఉద్యోగాలు, పెండ్లిళ్లు అన్నీ అయ్యేసరికి ఊళ్లో ఉన్న పొలం కాస్తా అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు నెలకు నువ్వు పంపే పదివేలే మాకు ఆధారం. ఏదో తాతల నుంచి వచ్చిన ఇల్లు ఉండబట్టి, జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నెలకు పదోపరకో వెనకేసుకొని ఉంటే.. ఈ రోజు నాకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండేది! కొడుకుగా తండ్రి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తున్నావు! కానీ, తండ్రిగా కొడుకు నుంచి ఆశించకుండా ఉండే స్థితిలో నేను లేను. రేపు నీకు ఇలాంటి రోజు రావొద్దనే చెబుతున్నా’ అని ముగించాడు శ్రీనివాస్. రమణకు తత్వం బోధపడింది. అంతకుముందు తండ్రితో చెప్పిన తన ప్రాధాన్యాలను మార్చుకున్నాడు. కూతురు చదువు, రిటైర్మెంట్ ప్లాన్, ఇల్లు, కారు ఇలా నిర్ణయించుకున్నాడు. మర్నాడే బెస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఏమున్నాయో వెతకడం ప్రారంభించాడు.
పాలసీ ఏదైనా..
చాలామందికి రిటైర్మెంట్ లైఫ్ అంటే ఏ పనీ లేకుండా ఉండటం అనుకుంటారు. కానీ, నచ్చిన పనిని, నచ్చిన విధంగా, నచ్చిన చోట ఉంటూ చేయగలగడమే అందమైన శేషజీవితం అనిపించుకుంటుంది. ఇలాంటి అదృష్టం కోరుకుంటే రాదు. భవిష్యత్ అవసరాలను గుర్తించగలిగితేనే అది సాధ్యమవుతుంది. ముప్పయ్లోకి ప్రవేశించగానే.. ఆ తర్వాత ముప్పయ్ ఏండ్ల తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవాలి. బాధ్యతలన్నీ తీరిన ఆ వయసులో భార్యాభర్తల అవసరాలకు ఎంత ఉంటే సరిపోతుందో అంచనా వేయగలగాలి. అందుకు తగ్గట్టుగా నెలవారీ పెన్షన్ వచ్చేవిధంగా రిటైర్మెంట్ ప్లాన్ ఎంచుకోవాలి. యాన్యుటీ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పాలసీలు ఏమున్నాయో తెలుసుకొని నెలకు కనీసం రూ.లక్షన్నర ఆదాయం వచ్చేవాటిని ఎంచుకోవాలి. ఆదాయం అధికంగా ఉన్నట్లయితే నెలకు అద్దెలు వచ్చేలా స్థిరాస్తులు కూడబెట్టడం మంచిది. మీ తదనంతరం మీ జీవిత భాగస్వామికీ ప్రతినెలా ఆదాయం సమకూరే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు శేషజీవితం భారంగా కాకుండా.. ప్రశాంతంగా గడపవచ్చు. జీవితమనే నాటకరంగంలో మీరు నిజమైన రంగమార్తాండుడు అనే పేరూ సంపాదించుకోవచ్చు!
భావోద్వేగాలకు లోనవ్వొద్దు
వార్ధక్యంలో మనిషిని కొన్ని బలహీనతలు చుట్టుముడతాయి. అందులో భావోద్వేగాలు కుదురుగా ఉండనీయవు. పదవీ విరమణ పొందిన రోజునే.. గ్రాట్యుటీ సొమ్మంతా తెచ్చి పిల్లలకు, మనవలకూ పంచేసి తృప్తిగా నవ్వుతారు. కానీ, అవి కొన్నాళ్లకే పరిమితం కావొచ్చు. మారిన విధానాల నేపథ్యంలో ప్రభుత్వోద్యోగులకూ రిటైర్ అయ్యాక నెలవారీ పెన్షన్ వచ్చే అవకాశం ఇప్పటికైతే లేదు. ఈ క్రమంలో ఉన్న సొమ్మంతా అందరికీ పంచేస్తే తర్వాత పూట గడవని పరిస్థితి ఏర్పడవచ్చు. అదే మొత్తం బ్యాంకులో ఎఫ్డీ చేసి నెలకు వచ్చే వడ్డీతో తృప్తిగా బతికేయండి. పండగకో, పబ్బానికో పిల్లలకు మీ శక్తిమేరకు ఎంతోకొంత ముట్టజెప్పండి.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Bank Auction Property | తక్కువలో వస్తుందని వేలంలో ఇల్లు కొంటున్నారా? ఈ నష్టాల గురించీ ఆలోచించండి
Reverse Mortgage Scheme | మీ ఇంటిని అద్దెకు ఇవ్వకుండానే ఇలా నెలనెలా వేలకు వేలు పొందండి
“Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!”
personal finance | నెలకు రూ.15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు సంపాదించవచ్చు
CIBIL Score | సిబిల్ స్కోర్ ఒక్కటి ఉంటే లోన్ వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటే..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

