Home Loan on Whatsapp | హోంలోన్ కావాలా.. వాట్సాప్‌లోనే అప్లయ్ చేసుకొండిలా..!
Home Loan on Whatsapp | ఇంటి రుణం తీసుకునేందుకు ఆసక్తి గల వారు.. వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చునని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
Home Loan on Whatsapp | ఇప్పుడంతా డిజిటల్‌మయం.. ఫోన్లో వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసి మన సన్నిహితులతో మాట్లాడొచ్చు. అవసరమైన సమాచారం చాట్ ద్వారా వెంటనే ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఇక మనీ ట్రాన్సాక్షన్స్ సరేసరి.. క్షణాల్లో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు పూర్తవుతున్నాయి. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ కోసం ఆన్లైన్ లోనే అప్లయ్ చేసేయొచ్చు. ఇప్పుడు ఏకంగా ఇంటి రుణం కోసం కూడా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ సంస్థ.. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Bajaj Housing Finance) వాట్సాప్ ద్వారా ఆన్ లైన్ హోంలోన్ అప్లికేషన్ ఫెసిలిటీ ప్రారంభించింది. వేతన జీవులు, ప్రొఫెషనల్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.
సొంతింటి కోసం బ్యాంకు రుణం తీసుకునేందుకు సిద్ధమైన వారు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం కోసం వాట్సాప్‌లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఈ ఫెసిలిటీ సోమవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిందీ సంస్థ. అర్హులైన వారు ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా.. సరైన వివరాలతో హోంలోన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది.
కొత్త ఇంటి రుణం\ ఇప్పటికే తీసుకున్న ఇంటి రుణం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా ఆన్లైన్లోనే అప్లయ్ చేసుకోవచ్చునని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. అప్లికేషన్ సమర్పించే సమయంలో దరఖాస్తు దారుడి పేరు, అతడి మొబైల్ నంబర్, పాన్ కార్డు తదితర వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వివరాలు సబ్మిట్ చేశాక.. దరఖాస్తుదారులు తమ అర్హత, లభించే లోన్ ఆఫర్ తదితర అంశాలు చెక్ చేసుకోవచ్చు. కనుక ఆసక్తి గల వారు రూ.1999 ప్లస్ జీఎస్టీ పే చేసి ‘డిజిటల్ ఇన్-ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్’ పొందొచ్చు.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Bajaj Housing Finance – BHF) వాట్సాప్ నంబర్ 75075 07315 అనే నంబర్‌కు ఆంగ్లంలో ‘హి (Hi)’అనే మెసేజ్ పంపాలి. అటుపై మీ ఇంటి లోన్ అర్హతను చెక్ చేయడానికి ఎనిమిది పత్రాలు సమర్పించాలి. వాటిల్లో మీ పేరు, మీరు సంప్రదించే ఫోన్ నంబర్, పాన్ కార్డు తదితర వివరాలు ఉన్నాయి. అర్హులైన దరఖాస్తుదారులకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 8.66 శాతం వడ్డీరేటు నుంచి ఇండ్ల రుణాలిస్తున్నది. ప్రొఫెషనల్స్, వేతన జీవుల అర్హతను బట్టి ఇంటి రుణం మంజూరవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

