Credit Card | క్రెడిట్ కార్డు యూజర్ మరణిస్తే.. రుణం ఏమవుతుంది?!
Credit Card | క్రెడిట్ కార్డుపై ఖర్చు చేసిన మొత్తం చెల్లించకముందే దాని యూజర్ మరణిస్తే.. సంబంధిత బ్యాంక్ ఆ రుణం రద్దు చేస్తుంది.
Credit Card | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. తమ వద్ద డబ్బు లేనప్పుడు వస్తువులు కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. ప్రత్యేకించి వ్యాపారులు, మధ్య తరగతి వర్గాల ప్రజలు క్రెడిట్ కార్డులు వాడేవారు. ఇప్పుడు కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి జీవనం సజావుగా సాగేలా క్రెడిట్ కార్డులు చేస్తున్నాయి. అంతే కాదు.. క్రెడిట్ కార్డులపై పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ క్రెడిట్ కార్డు పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. దీన్ని సరైన పద్దతుల్లో వాడుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకుండా క్రెడిట్ కార్డు ఉందని చెప్పి, ఇష్టారాజ్యంగా వాడితే రుణాల ఊబిలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. అలా రుణాల ఊబిలో చిక్కుకున్న వారు బయట పడటం చాలా కష్ట సాధ్యమే.
క్రెడిట్ కార్డు వాడకం కూడా ఒక లోన్ వంటిదే. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించక పోతే పెనాల్టీ, వడ్డీ భారం పడుతుంది. ఈ విషయమై యూజర్లు, సాధారణ ప్రజల్లో పలు సందేహాలు ఉన్నాయి. ఒకవేళ క్రెడిట్ కార్డు యూజర్ మరణిస్తే, ఆయన తీసుకున్న లోన్ ఏమవుతుందన్న ప్రశ్న అందులో ఒకటి. ఆ బకాయి చెల్లించాల్సిన బాధ్యత ఎవరిదన్న మీమాంస తలెత్తుతుంది. అది మాఫీ అవుతుందా.. లేదా.. అనే విషయం తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డులు అన్ సెక్యూర్డ్ లోన్ల క్యాటగిరీలోకి వస్తాయి. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆదాయం, సిబిల్ స్కోర్, ఇప్పటి వరకు తీసుకున్న లోన్లు.. వాటి పేమెంట్స్, క్రెడిట్ హిస్టరీ తదితర అంశాలు పరిశీలించిన తర్వాత వారి క్రెడిట్ కార్డు లిమిట్‌ను బ్యాంకులు ఖరారు చేస్తాయి. కనుక క్రెడిట్ కార్డు హోల్డర్ ఎటువంటి భూమి, ఫిక్స్డ్ డిపాజిట్, ఇతర ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
క్రెడిట్ కార్డు ద్వారా చేసిన ఖర్చు మొత్తం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా సదరు క్రెడిట్ కార్డు యూజర్ మీదే ఉంటుంది. ఒకవేళ, క్రెడిట్ కార్డు యూజర్ తాను ఖర్చు చేసిన బిల్లు మొత్తం తిరిగి చెల్లించకముందే మరణిస్తే.. ఆ రుణం చెల్లించాలని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను బలవంతం చేయలేరు. కనుక బ్యాంకు ఆ క్రెడిట్ కార్డు రుణం రద్దు చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

