Loan Payments | రుణాల చెల్లింపులు.. ఏ లోన్ ఫస్ట్ క్లియర్ చేయాలంటే?!
Loan Payments | ఒకటి కంటే ఎక్కువ రుణాలు ఉంటే.. అధిక వడ్డీ భారం గల పర్సనల్ లోన్.. అటుపై వెహికల్ లోన్ క్లియర్ చేయడం బెస్ట్ అని ఆర్థికవేత్తలు అంటున్నారు.
Loan Payments | గతంతో పోలిస్తే బ్యాంకుల్లో రుణాలు తేలిగ్గానే లభిస్తున్నాయి. ఇప్పటికే ఒక లోన్ తీసుకున్న వ్యక్తికి మరో రుణం కూడా మంజూరు చేస్తున్నాయి. ఫలితంగా చాలా మంది ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న వారు ఉన్నారు. హోంలోన్ తీసుకున్న వారు.. తర్వాత రుణంపై కారు కొనుక్కోవచ్చు. ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాల్సి రావచ్చు. ఒకటి కంటే రుణాలు ఎక్కువైతే నెలవారీ ఈఎంఐ’ల భారం కూడా పెరుగుతుంది. ఫలితంగా ఒక్కోసారి కొన్ని లోన్ల నెలవారీ వాయిదాలు పే చేయకపోవచ్చు. ఇటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం రుణాల చెల్లింపులు జరుపడం ప్రతి ఒక్కరికీ శ్రేయస్కరం. హోం లోన్, పర్సనల్ లోన్, కారు లోన్ల్లో ఏది ముందుగా క్లియర్ చేయాలనే మీమాంస తలెత్తినప్పుడు అనుసరించాల్సిన టిప్స్ తెలుసుకుందామా..!
ఏ రుణానికి వడ్డీ ఎంతో చెక్ చేయాలి ఇలా
ఒకటి కంటే ఎక్కువ రుణాలపై నెలవారీ వాయిదా (ఈఎంఐ)లు చెల్లిస్తున్న వారు.. వాటిలో ఏ రుణానికి అధిక వడ్డీ భారం పడుతుందో గుర్తించాలి. వాస్తవంగా హోంలోన్, ఆటోమొబైల్ రుణం కంటే వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుపై లోన్ వంటి వాటికి ఎక్కువ వడ్డీ భారం పడుతుంది. కనుక ముందుగా పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లోన్ చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తే మంచిది.
ముందే వెహికల్ లోన్ క్లియర్ చేస్తే బెటర్
హోంలోన్, ఆటోమొబైల్ లోన్ ఉన్నప్పుడు కారు లేదా బైక్ లోన్ త్వరత్వరగా తీర్చేయడం మేలు. కారైనా.. బైక్ అయినా కాలం గడిచే కొద్దీ దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. దీనికి తోడు హోంలోన్‌తో పోలిస్తే ఆటోమొబైల్ లోన్ మీద వడ్డీ ఎక్కువే. కాబట్టి ఎంత త్వరగా కారు లేదా బైక్ లోన్ తీర్చేస్తే బెటర్. ఇంటి రుణం అనేది దీర్ఘకాలికం కొనసాగేది. ఆస్తిని సంపాదించుకోవడానికి సాయపడే లోన్ హోంలోన్. కనుక ఇంటి రుణం తీర్చేయడానికి కొంత టైం తీసుకున్నా పర్వాలేదు. ఒకవేళ ఇంటి రుణం సకాలంలో చెల్లించలేకపోతే తమ వారసులకు అప్పగించొచ్చు.
టాప్అప్ లోన్‌తో ఇతర లోన్లు ఇలా క్లియర్
ఇంటి రుణం తీసుకున్న తర్వాత అవసరాలను బట్టి వెహికల్ లోన్‌తోపాటు పర్సనల్ లోన్ తీసుకోవాల్సి రావచ్చు. తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే ఒక రుణం మాత్రమే కొనసాగించేందుకు ట్రై చేయొచ్చు. అలా చేయాలంటే హోం లోన్ మీద టాప్ అప్ లోన్ తీసుకుని పర్సనల్, వెహికల్ లోన్ బకాయిలు క్లియర్ చేసేయొచ్చు. ఇంటి రుణాలపై మాత్రమే టాప్ అప్ లోన్ ఇస్తారు. ఇంతకుముందే తీసుకున్న హోం లోన్‌తో సమానంగా గానీ, కాసింత ఎక్కువగా వడ్డీ ఉన్నా.. పర్సనల్ లోన్ మీద వడ్డీ కంటే తక్కువే సుమా..!
ఇక ఇంటి రుణంపై ఎంత టాప్ అప్ లోన్ వస్తుందన్న సంగతి సంబంధిత రుణ గ్రహీత అర్హతతోపాటు ఆస్తి విలువను బట్టి ఆధార పడి ఉంటుంది. టాప్ అప్ లోన్ గడువు సాధారణంగా 20 ఏండ్లు.. లేదా ఒరిజినల్ హోంలోన్ గడువుతో సమానంగా ఉంటుంది.
ఇంటి రుణంపై పన్ను మినహాయింపులు
పర్సనల్ లోన్, వెహికల్ లోన్ పేమెంట్లకు ఎటువంటి పన్ను రాయితీ ప్రయోజనాలు ఉండవు. అయితే, హోంలోన్ మీద ఇన్‌కం టాక్స్ మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. ఇంటి రుణం అసలు చెల్లింపుపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఏటా రూ.150 లక్షలు, సెక్షన్ 24బీ కింద రూ.2 లక్షలు, మొత్తం ఇంటి రుణం చెల్లింపులపై ఏటా గరిష్టంగా రూ.3.50 లక్షల వరకు ఐటీ మినహాయింపు కోసం క్లయిమ్ చేయొచ్చు. కనుక ఇంటి రుణంపై దీర్ఘకాలికంగా ఎంతో పన్ను ఆదా చేసుకునే వీలు ఉంటుంది.
పర్సనల్/ వెహికల్ లోన్ క్లియరెన్స్ చేయాలంటే..!
హోంలోన్ తోపాటు పర్సనల్ లోన్, కారు లేదా బైక్ లోన్ తీసుకున్న వారు ముందుగా పర్సనల్ లోన్.. అటుపై వెహికల్ లోన్.. చివరిగా ఇంటి రుణం చెల్లింపులకు ప్రియారిటీ ఇస్తే వెసులుబాటుగా ఉంటుంది. హోంలోన్ ఈఎంఐలను సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా అడ్జస్ట్ చేసుకున్న నెలవారీ ఈఎంఐ చెల్లింపుల్లో ఎక్కువ మొత్తం పర్సనల్ లోన్, వెహికల్ లోన్ తీర్చడానికే ఉపయోగించడం బెటర్ అని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

