Google Chrome | ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ డెస్క్‌టాప్ యూజర్లకు హెచ్చరికలు చేసింది. పాత వెర్షన్లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని.. వాటి కారంగా యూజర్ల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని పేర్కొంది. బ్రౌజర్లోని లోపాలను ఆసరా చేసుకొని హ్యాకర్లు కీలక సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో క్రోమ్‌ని వినియోగిస్తున్న వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
142.0.7444.59 కంటే ముందున్న లైనక్స్, 142.0.7444.59/60 కంటే ముందున్న విండోస్, 142.0.7444.60 కంటే ముందున్న మ్యాక్ వెర్షన్ బ్రౌజర్లను వాడుతున్న వారంతా తక్షణం లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని.. లేకపోతే బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది. బ్రౌజర్‌ని అప్డేట్ చేసుకునేందుకు మొదట కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కుడిభాగంలో పైన మూడు చక్కలు కనిపిస్తాయి.
దానిపై క్లిక్ చేస్తే హెల్ప్ అనే మెనూ కనిపిస్తుంది. అందులో ఎబౌట్ గూగుల్ క్రోమ్ (About Google Chrome) అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా బ్రౌజర్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ పూర్తయ్యాక రీలాంచ్ బటన్‌పై క్లిక్ చేయాలి. దాంతో బ్రౌజర్ క్లోజ్ అయి.. మళ్లీ ఓపెన్ అవుతుంది. దాంతో మీ బ్రౌజర్ అప్డేట్ అయినట్టే. అయితే, ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.