ఆర్బీఐ డీజీగా మరో ఏడాది రాజేశ్వర్ రావు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 9న రాజేశ్వర్ రావు మూడేండ్లకుగాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎం రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2020 అక్టోబర్ 9న రాజేశ్వర్ రావు మూడేండ్లకుగాను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే వచ్చే నెల అక్టోబర్ 8తో ఈ గడువు తీరిపోతున్నది. ఈ క్రమంలో ఇంకో ఏడాది పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 9 నుంచి ఇది అమల్లోకి రానుండగా, అప్పట్నుంచి ఏడాది లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏది ముందైతే దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంగళవారం ఆర్బీఐ తెలిపింది.
ప్రస్తుతం ఆర్బీఐలోని రెగ్యులేషన్, కమ్యూనికేషన్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలతోపాటు లీగల్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల ఇంచార్జీగా రాజేశ్వర్ రావు ఉన్నారు. 1984లో ఆర్బీఐలో చేరిన రాజేశ్వర్ రావు.. కొచ్చిన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. 2016 నవంబర్‌లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. తన కెరియర్లో హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీల్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ పనిచేశారు. కాగా, ఆర్బీఐకి మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లుంటారు. రాజేశ్వర్ రావు కాకుండా మిగతా ముగ్గురిలో జే స్వామినాథన్, టీ రవిశంకర్, ఎం.డీ పాత్ర ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

