న్యూఢిల్లీ, మార్చి 30 : చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్ 1 నుంచి మూడు నెలలపాటు) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
దీంతో పీపీఎఫ్, ఎన్ఎస్సీ ప్రస్తుతం ఉన్న రేట్లే కొనసాగనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. సుకన్య స్కీమ్‌పై 8.2 శాతం వార్షిక వడ్డీరేటును ఆఫర్ చేస్తున్న కేంద్రం..పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం, పోస్టాఫీస్ స్కీమ్‌లపై 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నది.