న్యూఢిల్లీ, జనవరి 19: ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.718 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.458 కోట్ల కంటే ఇది 57 శాతం అధికం. ఏడాది క్రితం రూ.7,636 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.9,139 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. కానీ, బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.3,285 కోట్ల నుంచి రూ.3,152 కోట్లకు తగ్గాయి. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.85 శాతం నుంచి 4.50 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 2.09 శాతం నుంచి 1.27 శాతానికి తగ్గాయి.