న్యూఢిల్లీ, జూన్ 28: సిమెంట్ ధరలు మళ్లీ పెరిగాయి. గడిచిన నెలలో బస్తా సిమెంట్ ధర రూ.50 చొప్పున పెరిగింది. దీంతో గత నెలలో 50 కిలోల బరువు కలిగిన సిమెంట్ బస్తా ధర రూ.50 అధికం కావడంతో రూ.360కి చేరుకున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే సిమెంట్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం అధికమై 39.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నట్లు తెలిపింది.
ఉత్పత్తి వ్యయం తగ్గుముఖం పట్టడంతోపాటు బొగ్గు, పెట్కోక్, డీజిల్ ధరలు తగ్గడం కూడా సిమెంట్ తయారీ సంస్థలకు భారీ ఊరట లభించిందని, ముఖ్యంగా నిర్వహణ లాభాలు అంతకంతకు పెరిగాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో సిమెంట్ ధరలు ఏడు శాతం వరకు అధికమై రూ.360కి చేరుకున్నట్టు తెలిపింది. కానీ, గతేడాది ఇదే నెలల్లో ధరలు 7 శాతం తగ్గాయి.