Anil Ambani | బ్యాంక్ మోసం కేసు.. అనిల్ అంబానీ ఆఫీసుల్లో సీబీఐ సోదాలు
Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణలతో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సోదాలు చేపట్టింది (CBI Raids).
Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)కి మరో షాక్ తగిలింది. మనీలాండరింగ్ ఆరోపణలతో అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) సోదాలు చేపట్టింది (CBI Raids). బ్యాంక్ మోసం కేసులో (Bank Fraud Case) రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు శనివారం సోదాలు చేస్తున్నారు.
మనీ లాండరింగ్ ఆరోపణలతో సంబంధమున్న రూ.2,000 కోట్ల మోసపూరిత ఎస్బీఐ రుణం కేసులో ఈ తనిఖీలు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కాగా, 2017-19 మధ్య యస్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.3 వేల కోట్ల రుణం తీసుకొని దారి మళ్లించారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెల అనిల్ అంబానీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఫ్రాడ్‌గా గుర్తించిన ఎస్బీఐ
కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనిల్ అంబానీని ఇప్పటికే ఫ్రాడ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలు ఎస్బీఐసహా ఆయా బ్యాంకుల నుంచి మొత్తం రూ.31,580 కోట్ల రుణాన్ని తీసుకున్నట్టు తాజా ఫైలింగ్‌నుబట్టి తెలుస్తున్నది. అయితే ఈ నిధులను దుర్వినియోగపర్చినట్టు తాము గుర్తించామని ఆర్‌కామ్‌కు పంపిన లేఖలో ఎస్బీఐ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌కామ్ నడుచుకున్నట్టు పేర్కొన్న బ్యాంక్.. దీన్నో మోసపూరిత రుణంగా వర్గీకరించాలని తమ ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ తీర్మానించినట్టు తేల్చిచెప్పింది. ఇచ్చిన రుణంలో రూ.13,667.73 కోట్లను రుణ చెల్లింపులు, ఇతర అవసరాలకు వాడుకోవాలని.. అలాగే రూ.12,692.31 కోట్లను కనెక్టెడ్ పార్టీల చెల్లింపులకు వినియోగించాలన్నది నిబంధన.
కానీ 2016లో రుణ చెల్లింపులకు రూ.6,265.85 కోట్లను, కనెక్టెడ్ పార్టీలకు రూ.5,501.56 కోట్లనే ఇచ్చారని ఎస్బీఐ చెప్తున్నది. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.250 కోట్ల రుణం, ఐఐఎఫ్‌సీఎల్ నుంచి పొందిన రూ.248 కోట్ల రుణాలకు సంబంధించి కూడా ఇదే అవకతవకల్ని గుర్తించినట్టు సమాచారం. కాగా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతాను మోసంగా ప్రకటిస్తే.. 21 రోజుల్లోగా ఆ వివరాలను ఆర్బీఐకి నివేదించాల్సి ఉంటుంది. అంతేగాక పోలీసులు లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఫిర్యాదు చేయాలి.
Also Read..
Stray Dogs | విద్యార్థినిపై వీధి కుక్కల దాడి.. ముఖంపై 17 కుట్లు
Road Accident | టెంపోను ఢీ కొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
TikTok | మళ్లీ భారత్‌లోకి టిక్ టాక్..? ప్రభుత్వ వర్గాలు ఏం చెప్పాయంటే..?
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- bank fraud case
- cbi
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

