Car Rates Down | కారు కొనాలని ఆలోచిస్తున్న వారికి త్వరలో భారీ ఊరట కలుగనున్నది. కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న శ్లాబుల విధానాన్ని మార్చింది. నాలుగు శ్లాబుల స్థానంలో రెండింటిని తీసుకువచ్చింది. మోదీ ప్రభుత్వం 2.0 జీఎస్టీ అమలుతో అనేక ఆటో కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానున్న విషయం తెలిసిందే. చిన్న కార్లపై (పెట్రోల్-ఎల్పీజీ-సీఎన్జీ ఇంజిన్ 1200 సీసీ వరకు నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు, డీజిల్ 1,500 సీసీ వరకు) ఇకపై జీఎస్టీ 18శాతం వర్తించనున్నది. మరోవైపు భారీ, లగ్జరీ వాహనాలపై 40 శాతం పన్ను విధించనున్నారు. గతంలో కార్లపై జీఎస్టీ 28శాతంగా ఉండేది. ప్రత్యేకంగా సెస్ కూడా ఉండేది. జీఎస్టీ సంస్కరణలతో వినియోగదారులు భారీగా ప్రయోజనం ఉండదనున్నారు. ఇప్పటి వరకు ఏ ఆటో మొబైల్ కంపెనీలు ఎంత వరకు ధరలు తగ్గించాయో తెలుసుకుందాం రండి..!
కొత్త జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని టాటా మోటార్స్ తెలిపింది. కంపెనీ వాహనాలు రూ.75వేల నుంచి రూ.1.55లక్షల వరకు ధరలు తగనున్నాయి. కంపెనీకి చెందిన నెక్సాన్ మోడల్ రూ.1.55లక్షల వరకు తగ్గించింది. సఫారీ రూ.1.45 లక్షలు, హారియర్ రూ.1.40 లక్షలు, ఆల్ట్రోజ్ రూ.1.10 లక్షలు, పంచ్ రూ.85వేలు, టియాగో రూ.75వేలు, టీగోర్ రూ.80వేలు, కర్వ్ రూ.65వేలు వరకు తగ్గనున్నాయి. ఇక మారుతి సుజుకి ధరలు సైతం భారీగానే తగ్గనున్నాయి. స్విఫ్ట్ మోడల్ ధర రూ.85వేలు, డిజైర్ రూ.61వేలు వరకు, రూ.78వేలు, జిమ్నీ రూ.1.14 లక్షలు, ఇన్విక్టో రూ. 2.25 లక్షలు, ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో, ఎర్టిగా తదితర మోడల్స్ ధరలు రూ.40వేల నుంచి రూ.75వేల వరకు తగ్గుతాయని కంపెనీ పేర్కొంది.
ఇక మహీంద్రా అండ్ మహీంద్రా సైతం ధరలను తగ్గించింది. యూఎస్యూవీ, యూవీ విభాగాల్లోనూ రూ.1.56లక్షల వరకు ధరలను తగ్గించింది. ఎక్స్‌యూవీ 3XO డీజిల్ రూ.1.56లక్షలు, ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ పెట్రోల్ రూ.1.40 లక్షలు, స్కార్పియో ఎన్ రూ.1.45 లక్షలు, బోలెరో-నియో రూ.1.27 లక్షలు, థార్ 2WD రూ.1.35 లక్షలు, థార్ రాక్స్ రూ.1.33లక్షలు, XUV700 రూ.1.43 లక్షల వరకు తగ్గనున్నాయి. మరో వైపు టయోటా-కిర్లోస్కర్ కార్ల ధరలు రూ. 3.49 లక్షల వరకు తగ్గనున్నాయి. ఫార్చునర్ రూ.3.49 లక్షలు, లెజెండర్ రూ.3.34 లక్షలు, వెల్ఫైర్ రూ.2.78 లక్షలు, హిలక్స్ రూ.2.52 లక్షలు, ఇన్నోవా క్రిస్టా రూ.1.80 లక్షలు, ఇన్నోవా హైక్రాస్ రూ.1.15 లక్షలు, కామ్రీ రూ.1.01 లక్షల దాకా ధరల భారం వినియోగదారులకు తగ్గనున్నాయి.