హైదరాబాద్, మే 13: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ, వాహ రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 8.55 శాతం ప్రారంభ వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్న బ్యాంక్.. 8.80 శాతం ప్రారంభ వడ్డీతో వాహన రుణాలను ఆఫర్ చేస్తున్నది.
దీంతోపాటు డాక్యుమెంటేషన్ చార్జీలను పూర్తిగా రద్దు చేసిన బ్యాంక్..ప్రాసెసింగ్ చార్జీలను తగ్గించింది. ఈ రేట్లను తగ్గించడంతో గృహ, వాహన రుణాలపై నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు తగ్గనున్నాయి.