హైదరాబాద్, జూన్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. రూపే క్రెడిట్ కార్డు ద్వారా వ్యాపారులకు యూపీఐ చెల్లింపుల సదుపాయాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సదుపాయాన్నిప్పుడు తమ పాపులర్ ‘కెనరా ఏఐ1’ బ్యాంకింగ్ సూపర్ యాప్లో అందుబాటులోకి తెచ్చింది. ఎన్పీసీఐ సహకారంతో ఈ తరహా సౌకర్యాన్నిస్తున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంక్ తమదేనని కెనరా ప్రకటించింది.