న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. బెంచ్మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో అన్ని రకాల రుణాలపై నెలవారి చెల్లింపులు అధికంకానున్నాయి.
పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొం ది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.70 శాతం నుంచి 8.75 శాతానికి చేరుకోనున్నది. వీటితోపాటు ఒక్కరోజు, నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్లను కూడా 5 బేసిస్ పాయింట్లు వడ్డించింది బ్యాంక్.