EPFO-Higher Pension | అధిక పెన్షన్ సూత్రంపై ఈపీఎఫ్ఓ అంతర్మధనం.. త్వరలో క్లారిటీ వచ్చేనా?!
EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అర్హతపై ఈపీఎఫ్ఓ మల్లగుల్లాలు పడుతున్నది. ఈపీఎఫ్ మీద భారం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయంపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.
EPFO-Higher Pension | ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే పెన్షన్.. వారి జీవనానికి కీలకంగా మారుతున్నది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో అధిక పెన్షన్ లెక్క కట్టి మంజూరు చేయడం వల్ల తీవ్ర ఆర్థిక భారం వల్ల ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) మనుగడ సాగించడమే ప్రశార్థకంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈపీఎస్ నిల్వలపై భవిష్యత్‌లో ప్రతికూల ప్రభావం పడకుండా, ఉద్యోగులకు సామాజిక న్యాయం దక్కేలా నూతన పెన్షన్ లెక్కింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చే విషయమై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కసరత్తు చేస్తున్నది. కొత్త పద్దతి ప్రకారం ఉద్యోగులకు లభించే అధిక పెన్షన్ కనీసం నాలుగో వంతు తగ్గుతుందని అంచనా.
పెన్షన్ అర్హత వేతనంపై ఈపీఎఫ్ఓ ఇలా క్లారిటీ
అధిక పెన్షన్ అర్హత గల ఉద్యోగుల పెన్షన్ అర్హత వేతనంపై వారం క్రితం ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం 2014 సెప్టెంబర్ కంటే ముందు రిటైరైన వ్యక్తికి చివరి 12 నెలల వేతన సగటును పెన్షన్ అర్హమైన వేతనంగానూ, తర్వాత రిటైరైతే ఐదేండ్ల వేతన సగటును ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది.ఇప్పుడు పెన్షన్ అర్హత వేతనం x సర్వీస్ కాలం / 70గా పెన్షన్ లెక్క గడుతున్నారు. గరిష్ట వేతన పరిమితి దాటి అధిక పెన్షన్‌కు అర్హత పొందే వారికి స్పెషల్ ఫార్ములా అమలు చేయాలన్న అభిప్రాయం కూడా ఉంది. అధిక పెన్షన్‌కు ఉమ్మడి ఆప్షన్ తీసుకున్నప్పుడే తాము నిర్ణయించే పెన్షన్ లెక్కింపు సూత్రానికి కట్టుబడి ఉండాలన్న షరతు విధించింది ఈపీఎఫ్ఓ. ఆ షరతు ఆధారంగానే దరఖాస్తులు స్వీకరించింది.
పెన్షన్ లెక్కింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం
దీంతో పెన్షన్ లెక్కింపు సూత్రం ఖరారు చేయడానికి జరిగిన చర్చలు రెండు విషయాలు తెర మీదకు వచ్చాయి. ఉద్యోగి సర్వీసు సగటు వేతనం పెన్షన్‌కు అర్హతగా నిర్ణయించాలన్న చర్చ జరిగినా. అధిక నిబంధనలకు విరుద్ధం అని, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఈపీఎఫ్ఓ వెనక్కి తగ్గింది. అలా కాకుండా పెన్షన్ అర్హత వేతనాన్ని సర్వీసు కాలంతో లెక్క గట్టి, దాన్ని 90తో బాగించే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నది. దీనివల్ల ఈపీఎఫ్‌పై భారం తగ్గడంతోపాటు ఉద్యోగులకు సామాజిక న్యాయం అందించవచ్చునని ఈపీఎఫ్ఓ భావిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

