Gold Bonds | సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో ప్రైమరీ మార్కెట్ నుంచి లేదా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనవచ్చు. స్టాక్ మార్కెట్ల విషయానికే వస్తే.. సెకండరీ మార్కెట్లో ఎస్జీబీల ధర వాటి సైప్లె, డిమాండ్ల ఆధారంగా ఉంటుంది. స్పాట్ మార్కెట్లో భౌతికంగారానికున్న రేటుకన్నా ఎస్జీబీల విలువ తక్కువగా ట్రేడ్ అవుతూ ఉంటుంది.
కాగా, తొలుత ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో అధిక రాబడిగల రాయితీ ఎస్జీబీలు దొరుకుతాయా? అన్నది చూడాలి. కొనుగోలులో వాటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం లాభదాయకం. ఇక మీ డీమ్యాట్ ఖాతాలో ఎస్జీబీ స్క్రిప్ కోడ్ను అన్వేషించి, ఆర్డర్ చేయవచ్చు. మరుసటిరోజు మీ డీమ్యాట్ ఖాతాలో బాండ్లు జమవుతాయి.