Akshaya tritiya | బంగారం, వెండి నాణేలు కొంటారా.. అయితే ప్రభుత్వ మింట్ నుంచి నేరుగా కొనేయండిలా
అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే సంప్రదాయ కొ నుగోళ్లతోపాటు గత కొన్నేండ్లుగా పెట్టుబడి సంబంధిత లావాదేవీలు అక్షయ తృతీయ వేళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
Akshaya tritiya | అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే సంప్రదాయ కొ నుగోళ్లతోపాటు గత కొన్నేండ్లుగా పెట్టుబడి సంబంధిత లావాదేవీలు అక్షయ తృతీయ వేళ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఫలితం గా అటు ఆభరణాల అమ్మకాలు.. ఇటు బం గారం, వెండి నాణేల విక్రయాలూ సాగుతున్నాయి. దశాబ్దాలైనా వన్నె తగ్గకపోవడం.. పాతది, కొత్తది అన్న తేడా లేకుండా ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగానే ధరలు పలుకడం.. సులభంగా అమ్ముకునే వీలుండ టం.. తనఖా పట్టైనా రుణాలు తీసుకునే వె సులుబాటుతో చాలామంది బంగారు నాణేలను కొనేందుకు ఇష్టపడుతున్నారిప్పుడు.
మింట్ సేల్స్ ఔట్లెట్ల నుంచి..
పెట్టుబడిదారులకు బంగారం అనేది ఎప్పటికీ ఓ సురక్షిత సాధనమే అని చెప్పుకోవచ్చు. అందుకే సగటు భారతీయ మధ్యతరగతి కుటుంబాలు సైతం బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఇలాంటి మదుపరులు.. భారత ప్రభుత్వ మింట్ సేల్స్ ఔట్లెట్ల నుంచి నాణేలను కొనుగోలు చేయవచ్చు. బహిరంగ మార్కెట్లలో ఎదురయ్యే మోసాలకు తావుండదు. అయితే మార్కెట్ తో పోల్చితే గ్రాము ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది.
అర తులం నుంచి..
అర్ధ తులం నుంచి ఐదు తులాల వరకు వివిధ పరిమాణాల్లో బంగారు, వెండి నాణేలు మింట్ ఔట్లెట్లలో లభిస్తున్నాయి. నేరుగా ఔట్లెట్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేయవచ్చు. లేదంటే ఆన్లైన్ ద్వారా కొనవచ్చు. ఆన్లైన్లో కొనాలనుకునేవారు www. indiagovtmint.in ను సందర్శించాలి. ఇక భౌతికంగా కొనాలనుకునేవారికి దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లోనే ఆ సౌకర్యం ఉన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, నోయిడా, ముంబై, కోల్కతాల్లోనే మింట్ సేల్స్ ఔట్లెట్లు ఉన్నాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
011-43582256, 011-40580035
24 క్యారెట్ 10గ్రాముల బంగారు నాణెం ధర 66,878.57
10గ్రాముల వెండి నాణెం 982.35
- హైదరాబాద్లో ఐడీఏ ఫేజ్ 2 చర్లపల్లి వద్ద మింట్ సేల్స్ ఔట్లెట్ ఉన్నది
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్మార్క్ ధ్రువీకరణతో నాణేల అమ్మకాలు అత్యంత విశ్వసనీయంగా జరుగుతాయి
- 99.9 స్వచ్ఛతతో కూడిన 24 క్యారెట్ బంగారాన్ని మదుపరులు సొంతం చేసుకోవచ్చు
- నగదు/డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరుపవచ్చు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

