Parliament Budget Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ నాలుగో తేదీన ముగుస్తాయి. తొలి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ, మలి విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకూ కొనసాగుతాయి.