Stocks | వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపట్లో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పించనున్న నేపథ్యంలో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఆశావాహ దృక్పథంతో స్వల్ప లాభాల్లో సాగాయి. తాత్కాలిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో స్టాక్ ఇండెక్స్‌లు భారీ ఒడిదొడుకులకు గురవుతున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ -30 248.4 పాయింట్ల లబ్ధితో 72,000.51 పాయింట్లతో పాజిటివ్‌గా సాగితే, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 62.65 పాయింట్లు పుంజుకుని 21,788.35 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అటుపై బెంచ్ మార్క్ ఇండెక్స్‌ల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నది.
సెన్సెక్స్ -30 ఇండెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ), టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ భారీగా పతనం అయ్యాయి. మరోవైపు జనవరి జీఎస్టీ వసూళ్లు 10.4 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోటలు దాటాయి.