న్యూఢిల్లీ, మే 21: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2,903.22 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు పేర్కొంది.
ఈ ఆర్డర్లో భాగంగా 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంతోపాటు సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్, వార్షిక నిర్వహణ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రాజెక్ట్‌నకు సంబంధించి అవసరమైన వస్తువులు లేదా సేవలు అందించడానికి టాటా గ్రూపునకు చెందిన మరో సంస్థ టీసీఎస్ తేజాస్ నెట్‌వర్క్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.