Union Minister Pemmasani | దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చికల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేసిన నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్ ను ఆయన ప్రారంభిస్తూ.. పట్టణాలతోపాటు మారుమూల గ్రామాలకూ ఇంటర్నెట్ సేవలు అందించడమే బీఎస్ఎన్ఎల్ లక్ష్యం అని చెప్పారు.
దేశవ్యాప్తంగా 4500 టవర్ల ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన 4జీ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విద్యుత్ తోపాటు క్వాలిటీ ఇంటర్నెట్ సేవలూ ముఖ్యమేనన్నారు. లాభాపేక్షే ధ్యేయంగా పని చేసే ప్రైవేట్ సంస్థలు మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందించబోవన్నారు. కానీ మారుమూల పల్లె వాసులకూ లాభాపేక్ష లేకుండా బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రధాని మోదీ లక్ష్యం అని అన్నారు. ప్రైవేట్ టెలికం సంస్థలు టారిఫ్ లు పెంచడంతో ప్రజలంతా బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారని చెప్పారు.
Citroen Basalt | సిట్రోన్ బసాల్ట్ ఎస్యూవీ కూపే ఆవిష్కరణ.. ఇవీ డిటెయిల్స్.. !
Hyundai Venue | హ్యుండాయ్ వెన్యూ అప్ డేటెడ్ వర్షన్ వెన్యూ ఎస్ (ఓ)+.. ధరెంతంటే..?!
World Bank – India | ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు.. భారత్ ఆ స్థాయికి చేరుకోవాలంటే..!