శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది. ఎం340ఐ ఎక్స్‌డ్రైవ్ కారు ఎక్స్‌షోరూం ధర రూ.69.2 లక్షలుగా ఉండగా, ఎస్ 1000 ఆర్ఆర్ సూపర్‌బైక్ ధర రూ.24.45 లక్షల వరకున్నది.
ఈ సందర్భంగా వచ్చే 8 వారాల్లో మార్కెట్‌కు 8 వాహనాలను పరిచయం చేసేందుకు సిద్ధమైనట్టు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా తెలిపారు. ఇందులో మూడు ప్రతిష్ఠాత్మక మోడల్స్ ఉన్నాయన్న ఆయన వచ్చే ఏడాది మరిన్ని విద్యుత్తు ఆధారిత వాహనాలనూ తెస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్ సెడాన్ ఐ7ను కూడా తీసుకొస్తామని ప్రకటించారు. ఈ సంస్థ బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్స్‌లో కార్లను, బీఎండబ్ల్యూ మోటరాడ్లో బైక్‌లను అమ్ముతున్న విషయం తెలిసిందే.