BMW India | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ (Mercedes – Benz) కార్ల తయారీ సంస్థ బాటలోనే బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) పయనించనున్నది. జనవరి ఒకటో తేదీ నుంచి తన కార్ల ధరలు మూడు శాతం పెంచనున్నట్లు బీఎండబ్ల్యూ ఇండియా శుక్రవారం తెలిపింది. కార్ల మోడల్ వారీగా ధర పెరుగుతుందని పేర్కొంది. సాధారణంగా బీఎండబ్ల్యూ ఇండియా ఏటా రెండుసార్లు కార్ల ధరలు పెంచుతుంది. ఇన్ పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో కార్ల తయారీ సంస్థలు కార్ల ధరలు పెంచుతాయి. ఇన్పుట్ కాస్ట్లో మెటీరియల్ కాస్ట్ ప్రధానంగా ఉంటుంది.
దేశీయంగా తయారు చేస్తున్న బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 3 సిరీస్ లాంగ్ వీల్ బేస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్, బీఎండబ్ల్యూ 7 సిరీస్ లాంగ్ వీల్ బేస్, బీఎండబ్ల్యూ ఎక్స్1, బీఎండబ్ల్యూ ఎక్స్3, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ ఎక్స్ 7, బీఎండబ్ల్యూ ఎం340ఐ కార్లతోపాటు కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్లు (సీబీయూ)గా తీసుకొస్తున్న బీఎండబ్ల్యూ ఐ4, బీఎండబ్ల్యూ ఐ5, బీఎండబ్ల్యూ ఐ7, బీఎండబ్ల్యూ ఐ7 ఎం70, బీఎండబ్ల్యూ ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, బీఎండబ్ల్యూ జడ్4 ఎం40ఐ, బీఎండబ్ల్యూ ఎం2 కూపే, బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్, బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్, బీఎండబ్ల్యూ ఎం5, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ కూపె, బీఎండబ్ల్యూ ఎక్స్ఎం (హైబ్రీడ్) కార్ల ధరలు పెరుగనున్నాయి. మెర్సిడెజ్ బెంచ్ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి తన కార్ల ధరలు మూడు శాతం పెరుగుతాయని తెలిపింది.