న్యూఢిల్లీ, నవంబర్ 22: లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ కూడా తన పోటీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ బాటపట్టింది. జనవరి నుంచి వాహన ధరలు మూడు శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించింది.
దేశీయంగా తయారైన 2 సిరీస్ గ్రాన్ కౌప్, 3 సిరీస్ లాంగ్ వీల్బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్బేస్, 7 సిరీస్ లాంగ్ వీల్బేస్తోపాటు ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7, ఎం340లతోపాటు ఐ4, ఐ5, ఐ7 ఎం70, ఐఎక్స్1, బీఎండబ్ల్యూ ఐఎక్స్, జెడ్4 ఎం40ఐ, ఎం2 కౌప్ మాడళ్లను విక్రయిస్తున్నది.