Bit Coin Record | క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ విలువ తిరిగి రికార్డు స్థాయికి చేరుకుంటున్నది. న్యూయార్క్‌లో సోమవారం ఇంట్రా డే ట్రేడింగ్‌లో 4.3 శాతం పెరిగి 57,829 డాలర్లు పలికింది. ఏప్రిల్‌లో ఆల్‌టైమ్ రికార్డు 65వేలకు చేరుకుని.. తర్వాత మే నుంచి పడిపోతూ వచ్చిన బిట్ కాయిన్ గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది దాదాపు బిట్ కాయిన్ విలువ రెట్టింపైంది.
బిట్ కాయిన్ లావాదేవీలపై అమెరికా, చైనా ప్రభుత్వాలు ఆంక్షలు సడలించాయి. బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (యూఎస్ఎస్ఈసీ) ఆమోదం తెలుపుతుందన్న ఆశల మధ్య ట్రేడర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది.
ప్రత్యేకించి బిట్ కాయిన్ ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లపై ఇన్వెస్టర్లు ఆసక్తితో ఉన్నారు. బిట్‌కాయిన్‌ను డెరివేటివ్ బేస్డ్ ప్రొడక్ట్‌గా పరిగణించాలని యూఎస్ రెగ్యులేటర్ చైర్ గ్యారీ గెన్స్లెర్ సంకేతాలిచ్చారు. దీంతో బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు మొగ్గు చూపుతున్నారని బిట్‌వైజ్ ఇన్వెస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హంటర్ హార్స్లే చెప్పారు. మున్ముందు బిట్ కాయిన్ 60 వేల డాలర్లకు దూసుకెళ్తుందన్న అంచనాలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hero Pleasure+ Xtec 110cc లాంఛ్ : ధర ఎంతంటే..!
భారత్‌లో న్యూ ట్రయంఫ్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ లాంఛ్..ధర ఎంతంటే!
Maruti Cars | పండుగల ఆఫర్.. మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు
Prakash Raj Panel | 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామా