Binance ceo | మాది చైనా కంపెనీ కాదు.. నేను చైనీయుడిని కాదు : బైనాన్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ సీఈఓ
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ చేస్తున్న పెద్ద కంపెనీల్లో బైనాన్స్ ఒకటి
Binance ceo : తమది చైనా కంపెనీ కాదని, తమకు చైనాతో ఏ సంబంధం లేదని బైనాన్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ సీఈవో జాంగ్పెంగ్ జావో అన్నారు. బైనాన్స్ అనేది చైనా కంపెనీ అంటూ వస్తోన్న వార్తలపై జాంగ్పెంగ్ తాజాగా స్పందించాడు. ‘బైనాన్స్ అనేది చైనా కంపెనీ కాదు. నేను పదే పదే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే.. నేను చూడ్డానికి చైనీయుడిలాగ ఉంటాను. కానీ, నేను గత 30 ఏళ్లుగా కెనడాలో నివసిస్తున్నాను’ అని జాంగ్పెంగ్ ఒక వీడయోలో వెల్లడించాడు. అంతేకాదు భవిష్యత్లో ఇదే విషయాన్ని తాను ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చినా ఆశ్చర్యపోనని అన్నాడు.
గతంలో కూడా బైనాన్స్ను చైనా దేశీయుడు రహస్యంగా నడిపిస్తున్నాడనే ఆరోపణలు వినిపించాయి. బైనాన్స్లోని ముఖ్య అధికారిగా ఉన్న గౌజింగ్ చెన్ చైనా ఉద్యోగి అని, అతను బిజీ టెక్ అనే కంపెనీలో మొదట పనిచేశాడని వాషింగ్టన్ పోస్ట్ ఒక వార్త ప్రచురించింది. అందులో బిజీ టెక్, బైనాన్స్కు అతనే సీఈవో అని పేర్కోంది. అయితే.. అవన్ని అవాస్తవాలని జాంగ్పెంగ్ కొట్టిపారేశారు. బైనాన్స్ క్రిప్టో అనేది ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ చేస్తున్న పెద్ద కంపెనీల్లో ఒకటి. బైనాన్స్ కాయిన్ను అమ్ముతుంది. ఈమధ్య బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ వాడకం పెరిగింది. ఇదొక డిజటల్ కరెన్సీ. ఇది కరెన్సీగానే కాకుండా వర్చువల్ అకౌంటింగ్ సిస్టంగా పనికొస్తుంది.
I wonder how many times I will have to repeat this one in the future (thanks to SBF’s media/lobbying power)…
Binance is not a Chinese company. https://t.co/GtcElzPw9T
— CZ 🔶 Binance (@cz_binance) November 24, 2022
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

