BHEL | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : భెల్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలోని రఘునాథ్‌పూర్ థర్మల్ పవర్ స్టేషన్-2లోభాగంగా ఏర్పాటు చేయతలపెట్టిన రెండు 660 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్టీమ్ జనరేటరు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ భారీ ప్రాజెక్టు నిర్వహించిన బిడ్డింగ్‌లో భెల్ ఆర్డర్ పొందింది. ఈ ఆర్డర్లో భాగంగా సంస్థ డిజైనింగ్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా, టెస్టింగ్, స్టీమ్ జనరేటర్ కమిషన్, నిర్మాణాత్మక వర్క్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.